ఆంధ్రప్రదేశ్, అమరావతి: ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయి ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సబబు కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కొమ్మరాజు సత్యనారాయణ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు రపా రపా నరుకుతాం అన్న మాటలు తప్పులేదని, అలా నరికితే ఏమవుతుంది అని మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించటం పద్దతి కాదని మందలించారు. ఇటువంటి వ్యాఖ్యలు వలన రాష్ట్రంలోశాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లే అవుతుందని అన్నారు.
ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడటం ఆయనకు తగదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పి అతని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.