డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు: మండలంలోని చెముడులంక శ్రీషిర్డిసాయి స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుచున్న మూలస్థాన అగ్రహారంకు చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇనపకోళ్ళ పట్టాభి కుమారుడు విజయ సతీష్ కుమార్ రాష్ట్రస్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించాడు. "నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియిడ్" వారు ఇటీవల నిర్వహించిన (మన సంస్కృతి) అంశానికి సంబంధించిన పరీక్షలో రాష్ట్ర స్థాయి ప్రధమ ర్యాంకు వచ్చింది.
ఈ మేరకు శనివారం తిరుపతిలో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమములో ఆ విద్యార్ధి సతీష్ కుమార్ కు తిరుపతి మహిళా పోలీసు స్టేషను డిఎస్పీ ఎమ్. శ్రీలత చేతుల మీదుగా రూ.5 వేలు చెక్, ప్రశంశాపత్రంతో పాటు మెమొంటోను అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీలత మాట్లాడుతూ ఈరోజుల్లో చాలామంది వయస్సుతో సంబంధం లేకుండా గంజాయి మత్తుకు బానిసలై తల్లిదండ్రులకు అవమానాన్ని తెస్తున్న ఈ రోజుల్లో తన గురి లక్ష్యంగా ముందుకు వెళుతూ తన ప్రతిభ కనబరిచిన విద్యార్థిని శ్రీ షిర్డీ సాయి విద్యార్థినిని అభినందించారు.
విద్యాసంస్థల కరస్పాండెంట్ మాట్లాడుతూ స్కూల్ కి ఎంత మంచి పేరు తీసుకొచ్చినా సతీష్ ని అలాగే సతీష్ లాంటి ఎంతోమంది విద్యార్థు లను తయారు చేసే బాటగా మా స్కూల్ యాజమాన్యం కావలసిన చదువుని వారికి అందించి వారిని ఉన్నతమైన స్థానంలో చూడాలని మా స్కూలు యొక్క ఉద్దేశమని ఉమారాణి అన్నారు. అలాగే ఇంత మంచి పేరు తీసుకొచ్చిన సతీష్ కుమార్ ను శ్రీ షిరిడి సాయి స్కూల్ కరస్పాండెంట్ ఉమారాణి అభినందించారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema