Hot Posts

6/recent/ticker-posts

ఇక చెవిరెడ్డి కుమారుడి వంతు.. 25న రమ్మంటూ సిట్ నోటీసులు


ఏపీ మద్యం స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ఏపీ మద్యం స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు కాగా, తాజాగా ఆయన కుమారుడు, చంద్రగిరి వైసీపీ ఇన్చర్జి మోహిత్ రెడ్డిని విచారణకు రమ్మంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కాంలో మోహిత్ రెడ్డి 39వ నిందితుడిగా అభియోగాలు మోపారు పోలీసులు. చెవిరెడ్డి అరెస్టు సమయంలోనే మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారని భావించారు. కానీ, శ్రీలంక వెళ్లే క్రమంలో బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంతో చెవిరెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుంది. ఇక తండ్రి అరెస్టుతో ఆందోళన చెందిన మోహిత్ రెడ్డి అప్పటి నుంచి పరారీలోనే ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడమే కాకుండా, తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.

బెయిల్, స్కాష్ పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరగాల్సివుంది. అయితే కోర్టు ప్రారంభానికి ముందే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న తమ ముందు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న మోహిత్ రెడ్డి సిట్ విచారణకు వెళతారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో చంద్రగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహిత్ రెడ్డి పోటీ చేశారు. ఈ సమయంలో లిక్కర్ డబ్బులు ఆయనకు అందాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.

లిక్కర్ కేసులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి వివిధ మార్గాల ద్వారా చెవిరెడ్డికి ముడుపులు చేరాయని, సుమారు రూ.250 కోట్లు తీసుకున్న చెవిరెడ్డి ఐదు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు వాటిని పంచిపెట్టారని అంటున్నారు. డబ్బు అక్రమ తరలింపులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఉన్నట్లు సిట్ ఆరోపిస్తుంది. చెవిరెడ్డి, ఆయన కుమారుడు పాత్రను నిర్ధారించేందుకు గత కొద్ది రోజుల గూగుల్ లొకేషన్ కూడా పోలీసులు సేకరించారని అంటున్నారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now