పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో భేటీలో వినతి పత్రంతో కోరిన ఎంపీ హరీష్ బాలయోగి…
ధాన్యం సేకరించిన 24 గంటల లోపే రైతులకు సొమ్ములు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం : ఎంపీ హరీష్ బాలయోగి
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రైతుల పక్షపాతి అయిన కూటమి ప్రభుత్వం వారిని BY: PASCHIMA VAHINI అండగా నిలిచేందుకు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కోరారు.
విజయవాడలోని మంత్రి కార్యాలయంలో మనోహర్ తో హరీష్ భేటీ అయ్యి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రబీ సీజన్లో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్లను కలిసిన జిల్లా ఎమ్మెల్యేల కోరిక మేరకు మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించిన విషయం తెలిసిందేనని చెప్పారు.
కానీ రైతుల వద్ద ఇంకా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని కావునా కోనసీమ జిల్లాలో మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాలని ఎంపీ హరీష్ మంత్రి మనోహర్ ను కోరినట్లు చెప్పారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారని హరీష్ తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల లోపే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అని హరీష్ వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.