Hot Posts

6/recent/ticker-posts

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారా? కీలక అప్డేట్ మీ కోసమే!


ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న విషయం తెలిసిందే. BY: PASCHIMA VAHINI ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న క్రమంలో గ్రామాలలో ఈ ప్రక్రియ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ప్రక్రియను కొనసాగిస్తున్నారు.


ఏపీలో కొత్త రేషన్ కార్డులు
ఇక కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి తమకు రేషన్ కార్డు వస్తుందో లేదో, రేషన్ కార్డు వస్తే ఎన్ని రోజుల్లో వస్తుందో, అసలు తమ దరఖాస్తు ఎవరి వద్ద ఉందో తెలియక గందరగోళానికి చాలామంది గురవుతారు. అయితే ఇకపై ఆ గందరగోళం లేకుండా అన్నింటిని ఆన్లైన్ లోనే చూసుకునే వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం.

ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్
ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ, విఆర్వో, తహసిల్దార్ ఇలా మూడుచోట్ల పరిశీలన జరుగుతుంది. రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో అధికారులను అడగాల్సిన అవసరం లేదు. వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు. ఏపీ సేవ పోర్టల్ https://vswsonline.ap.gov.in/ లోకి వెళ్లి కుడివైపు పైన ఉన్న సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ను క్లిక్ చేసి అందులో రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాలి.

నేరుగా రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకునే వీలు
అప్పుడు ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ వివరాలను అందులో నమోదు చేస్తే రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో తెలిసిపోతుంది . అంతేకాదు రేషన్ కార్డు ప్రక్రియ ఎన్ని రోజులకు పూర్తవుతుంది వంటి వివరాలు కూడా అందులోని కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
వీరికి స్మార్ట్ కార్డు రూపంలోనే రేషన్ కార్డు ఉచితంగా ఇస్తామని, ఇక ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారికి కూడా స్మార్ట్ కార్డులు త్వరలోనే ఇస్తామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇక ఈకేవైసీ కి 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఒక సంవత్సరంలోపు పిల్లలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పాత రేషన్ కార్డులు ఉన్నవారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళితే ఇస్తారని చెబుతున్నారు.

రేషన్ కార్డు తీసుకోవటం చాలా సులభం
అంతేకాదు లింగ మార్పిడి చేయించుకున్న ట్రాన్స్ జెండర్ లకు కూడా తొలిసారిగా రేషన్ కార్డు ఇస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రేషన్ కార్డు కోసం గతంలో లాగా తిప్పలు పడాల్సిన అవసరం లేదని, రేషన్ కార్డు తీసుకోవడం చాలా ఈజీ అని ఆయన పేర్కొన్నారు.