Hot Posts

6/recent/ticker-posts

అమరావతి పై కాంగ్రెస్ కొత్త ట్విస్ట్..!! కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..


ANDRAPRADESH, AMARAVATHI: ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. BY: PASCHIMA VAHINI ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంఛ్ లో పాల్గొన్నారు. పనులు మూడేళ్ల కాలంలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ మూడు రాజధానులు ప్రతిపాదన చేయగా.. ఎన్నికల్లో ఆ నినాదానికి మద్దతు లభించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అమరావతికి జై కొట్టాయి. కాగా, ఇప్పుడు అమరావతి రెండో విడత భూ సమీకరణ ప్రతిపాదనల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

ట్రంప్ జోక్యం కేంద్ర మాజీ మంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆపరేషన్ సింధూర్ తో పాటుగా అమరావతి అంశం పైన స్పందించారు. యుద్ధం మొదలైంది. మధ్యలో ఆగిపోయింది. ఎందుకు మొదలుపెట్టారో..ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదుని వ్యాఖ్యానించారు. 1971లో ఇందిరా గాంధీ చేసినట్లు జరుగుతుందని, లేదా 1999 లో వాజ్ పేయ్ కార్గిల్ యుద్ధం జరిగినట్లు జరుగుతుందని భావించామని చెప్పుకొచ్చారు. భారత సైనికులకు తలవంచి, వినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తోందని విమర్శించారు. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు. ట్రంప్ కి, భారతదేశానికి ఏంటి రహస్య ఒప్పందమని చింతా మోహన్ ప్రశ్నించారు.

ఏకపక్ష నిర్ణయాలు కేంద్రం పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచి, చర్చించి ఉంటే బాగుండేదన్నారు. దేశ ఔన్నత్వానికి, సార్వభౌమాధికారానికి బీజేపీ మచ్చ తెచ్చిందని విమర్శించారు. ప్రతిపక్షాలను పరి గణలోకి తీసుకోవాలని సూచించారు. ఆర్థిక సంపదంతా కొందరికే పోతుందని..జాతీయ బ్యాంకులు కొందరు సొత్తు కాదని చెప్పిన చింతా మోహన్ అందరి సొత్తుగా పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ కాంట్రాక్టులు 25% ఎస్సీ, ఎస్టీలకు ఇస్తోందని..ఏపీలో లో ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. లంచాలు తీసుకుని, వేలకోట్ల రూపాయలు విలువైన మైన్స్, గనులు, ఇసుక కేటాయింపులు ఇస్తున్నారని ఆరోపించారు. సహజ వనరులను సహజంగా అందరికీ సమానంగా పంచాలని డిమాండ్ చేసారు. లేకుంటే తాము ప్రతి జిల్లాలో ఉద్యమాన్ని మొదలుపెట్టతామని హెచ్చరించారు.

అమరావతి పై.. 
హైదరాబాద్ రాజధానిలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయని చింతా మోహన్ ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో చెప్పాలన్నారు. ఇప్పటికే 33 వేల ఎకరాలు భూములు తీసుకున్నారని.. మళ్లీ 40000 ఎకరాలు కావాలని చెప్పటం ఏంటని వ్యాఖ్యానించారు. రాయలసీమ జిల్లాల్లు మొదలుకుని, ఒంగోలు వరకు ఉన్న జిల్లాల ప్రజలందరూ బాధపడుతున్నారనన్నారు. ఈ గవర్నెన్స్ వచ్చినప్పుడు 50 అంతస్తుల భవనాలు ఎందుకో చెప్పాలన్నారు. వేల కోట్ల రూపాయలు ఒక దగ్గర ఖర్చు పెట్టడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాజధాని భూ కేటాయింపుల్లో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు పెట్టడం మంచిది కాదని..సంయమనం అవసరమని సూచించారు. కరెంట్ బిల్లులు పెంచడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి మొదలైందని.. సీఎం కి సరైన సలహాదారులు లేరని చెప్పన చింతా మోహన్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో వుందన్నారు.