INDAI NEWS : దేశంలో వర్షాకాలం కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు. BY: PASCHIMA VAHINI ఇది వ్యవసాయ రంగానికి జీవనాడి. ఈ క్రమంలో 2025లో నైరుతి రుతుపవనాలు చాలా ముందుగా వస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రుతుపవనాలు 16 సంవత్సరాల తర్వాత మే 27 నాటికే కేరళ తీరానికి చేరుకుంటాయని ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ రంగంతోపాటు సామాన్య ప్రజలకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. దేశంలో దాదాపు 60% వ్యవసాయం వర్షాధారితం. రుతుపవనాలు సమయానికి, సరైన పరిమాణంలో వస్తే, పంటల దిగుబడి పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
16 ఏళ్ల తర్వాత ముందుగా..
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. కానీ ఈ సంవత్సరం, 16 సంవత్సరాల తర్వాత, మే 27 నాటికే కేరళలో రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. ఈ అరుదైన సంఘటన చివరిసారిగా 2009లో జరిగింది. రుతుపవనాలు ముందుగానే రావడం వల్ల దక్షిణ భారతంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు త్వరగా మొదలవుతాయి. ఇది వ్యవసాయ కార్యకలాపాలకు, ముఖ్యంగా వరి, చెరకు, కాఫీ, తేయాకు వంటి పంటలకు అనుకూలంగా ఉంటుంది. అయితే రాష్ట్రాల ప్రకారం చూస్తే ఏ ప్రాంతాల్లో ఎప్పుడు నైరుతి రుతుపవనాలు వస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
2025 నైరుతి రుతుపవనాల రాక అంచనా..
అండమాన్ నికోబార్ దీవులు - మే 13, 2025
కేరళ - మే 27, 2025
కర్ణాటక - 1-2 జూన్ 2025
తమిళనాడు - 3-5 జూన్ 2025
ఆంధ్రప్రదేశ్ - 30 మే - 1 జూన్ 2025
తెలంగాణ - 4-6 జూన్ 2025
మహారాష్ట్ర - 7-10 జూన్ 2025
గోవా - 5-7 జూన్ 2025
గుజరాత్ - జూన్ 15, 2025
మధ్యప్రదేశ్ - 15-18 జూన్ 2025
ఛత్తీస్‌గఢ్ - 12-15 జూన్ 2025
ఒడిశా - 10-12 జూన్ 2025
పశ్చిమ బెంగాల్- 12-14 జూన్ 2025
జార్ఖండ్ - 14-16 జూన్ 2025
బీహార్ - 15-17 జూన్ 2025
ఉత్తర ప్రదేశ్ - 18-20 జూన్ 2025
ఢిల్లీ- 25-27 జూన్ 2025
హర్యానా- 26-28 జూన్ 2025
పంజాబ్- 27-29 జూన్ 2025
రాజస్థాన్- 20-25 జూన్ 2025
హిమాచల్ ప్రదేశ్- 28-30 జూన్ 2025
ఉత్తరాఖండ్-26-28 జూన్ 2025
జమ్మూ కాశ్మీర్-30 జూన్ - 2 జూలై 2025
సిక్కిం-10-12 జూన్ 2025
అసోం- 10-12 జూన్ 2025
మేఘాలయ-11-13 జూన్ 2025
మణిపూర్-12-14 జూన్ 2025
మిజోరం - 13-15 జూన్ 2025
త్రిపుర-14-16 జూన్ 2025
నాగాలాండ్- 13-15 జూన్ 2025
గమనిక: పై తేదీలు తాత్కాలికంగా వాతావరణ శాఖ సూచనలపై ప్రకటించినవి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ తేదీలు మారే అవకాశం ఉంది.
రుతుపవనాలు ప్రస్తుతం ఎక్కడ..
IMD ప్రకారం, మే 13, 2025 నాటికి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి అవి నెమ్మదిగా దక్షిణ భారతదేశం వైపు కదులుతున్నాయి. రుతుపవనాల వేగం సాధారణం కంటే వేగంగా ఉంది. దీని కారణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో మే చివరి వారంలోనే వర్షాలు ఆరంభమయ్యే అవకాశం ఉంది.