డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: మే' 6,7,8 తేదీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిఎంసి బాలయోగి స్టేడియం నందు సువార్త స్వస్థత సభలు ఏర్పాటు చేయడం జరిగింది.
అందుకొరకు ముందుగా సేవకుల ఆత్మీయ సదస్సు అమలాపురం అంబేద్కర్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ వర్తమానికులు దైవజనులు బి.జెర్మియా శ్రేష్టమైన వాక్య సందేశం అందించి దైవ సేవకులను బలపరిచినారు. క్రైస్తవ సంఘాలన్నీ ఐక్యతతో సమాధానంతో ఉండాలని తెలిపారు.
అనంతరం ప్రార్థన చేసి సభల వాల్ పోస్టర్స్ విడుదల చేశారు. ప్రేమ విందు కార్యక్రమంతో ఈ సహవాస కూడిక ముగించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ ఎం యెహోషువ, అమలాపురం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ప్రభు కుమార్, యూపీఎస్ అధ్యక్షులు యమ్ సర్జన్ రాజు, పాస్టర్ ఆర్ జోసెఫ్, హోసన్న, షాలెంరాజు, రాజేష్, ప్రభుదాస్, జాన్ విక్టర్, జాన్ ప్రసాద్, ఏసుబాబు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.