Hot Posts

6/recent/ticker-posts

వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా ఏలూరులో ముస్లిం సోదరుల భారీ నిర.సన ర్యాలీ


ఏలూరు జిల్లా: ఏలూరులోముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంటులో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 

ఈ ర్యాలీ ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో కర్బలా మైదాన్ వద్ద జేఏసీ నాయకులు ప్రారంభించారు. అక్కడ నుంచి పవర్ పేట గేట్ రోడ్డు, రామచంద్రరావు పేట, (ఆర్ఆర్ పేట) గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని, ఈ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పై పునరాలోచించి తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

లేనిపక్షంలో దేశవ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమాలను ఉదృతంగా చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ర్యాలీలో ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ సభ్యులు, కన్వినర్(జేఏసీ) హఫీజ్ ఇలియాజ్, అంజుమన్ అధ్యక్షుడు ఎండి. జబివుల్లా, జమాత్ ఇస్లాం అధ్యక్షుడు ఇబ్రహీం, నయీముల్లా, రియాజ్, జావీద్, సూరజ్, రజాక్, అక్బర్, సిద్దీక్, నూరుల్లా, రియాజ్, అక్బర్, జాబీర్, బయసీద్, అస్లం రాజా, అబూబకర్ హుమ్రి, ముస్లిం సోదరులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్.. ఏలూరులో ముస్లింలు భారీ ర్యాలీకి మద్దతు ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యే బడేటి చంటి

ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయకపోతే దఫళ వారీగా ఉద్యమం ఏలూరు జేఏసీ అధ్యక్షులు ఇలియాస్


ఏలూరు జిల్లా ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టిన వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది ఈ నిరసన ర్యాలీకి కూటమి ఎమ్మెల్యే బడేటి చంటి మద్దతు ఇస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు ఎటువంటి నష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. 

ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్ర ప్రజలకు హాని కలకొండ పాలన చేస్తారని పేర్కొన్నారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ఎండి ఇలియాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం పూర్వీకులు పుణ్యం కోసం దానం చేసిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే విధంగా ఈ చట్టం రూపొందించారని అన్నారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ చట్టాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ముస్లిం పర్సనల్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా దఫళ వారీగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు కమ్యూనిస్టు పార్టీ నాయకులు ముస్లిం పురుషులు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.