రాజ్యాంగం ఇచ్చిన హక్కును, సుప్రీంకోర్టు తీర్పు ను గౌరవించాలి.. జిల్లా ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వైస్ ప్రెసిడెంట్ అజాద్
ఏలూరు జిల్లా, చింతలపూడి: పల్నాడు జిల్లా మాచర్ల లో జరిగిన హత్య కథనం గురించి ప్రచురించిన సాక్షి ఎడిటర్, ఆరుగురు పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, శనివారం చింతలపూడిలో జర్నలిస్టులు గళ మెత్తారు.
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ కే ఆజాద్ మాట్లాడుతూ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని, అంతేకాక అక్టోబర్ నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్, జస్టిస్ భాటీలు పత్రికా జర్నలిస్టులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ఉందని అంతమాత్రాన జర్నలిస్టులపై కేసులు పెట్టవద్దని తీర్పులు ఇచ్చారని ఆజాద్ గుర్తు చేశారు.
కాబట్టి ప్రభుత్వం పల్నాడు జిల్లాలో జర్నలిస్టులపై సాక్షి ఎడిటర్ పై, ఆరుగురు పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, కైకలూరు లో న్యూస్ రైట్ పత్రికా ఎడిటర్ పై జరిగిన దాడిని, రాష్ట్రంలో జర్నలిస్టుల పై దాడులు అరికట్టాలని పత్రికా స్వేచ్ఛ ను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ స్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ sk అమీర్ పాషా, ప్రసాద్ రెడ్డి ముతేశ్వరరావు, కృపావరం, గంధం నాగేశ్వరరావు, మూర్తి, ఖలీల్, సంజయ్, సురేష్,రజినీ,కిషోర్, సుధాకర్ ,వెంకట్ ,శివ , పాషా, సునీల్, రాంబాబు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.