Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడిలో ప్రజా సమస్య పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్


ప్రజా సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఏలూరు జిల్లా, చింతలపూడి: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రజా వేదిక లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. బుధవారం చింతలపూడి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసి మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని, పరిష్కరించే విధంగా అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగిందని తెలిపారు. 

ప్రజల నుంచి వచ్చిన అర్జీలు సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి ఇచ్చిన గడువులోగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్, తాసిల్దార్, ఎంపీడీవో, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.