చింతలపూడి: చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ని కలిసిన సిపిఐ మండల కమిటీ సభ్యులు ఈ సందర్భంగా చింతలపూడి నుంచి కాంతం పాలెం వెంకటాపురం వెంకటాద్రి గూడెం మీదుగా గణిజర్లకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయనకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ గణిజర్ల గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు అటు రాఘవాపురం సత్తుపల్లి వెళ్లాలి అన్నా.. ఇటు చింతలపూడి రావాలన్నా.. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, వీరితోపాటు గ్రామంలో కూరగాయలు పండించిన చిన్న సన్నకారు రైతులు వాటిని అమ్ముకోవడానికి సత్తుపల్లి చింతలపూడి రావాలంటే అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు.
కావున గనిజర్ల కి బస్సు సౌకర్యం కల్పించాలని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ని కలిసి విన్నవించినట్లు సిపిఐ సీనియర్ నాయకులు మామిళ్ళపల్లి వసంతరావు తెలిపారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు, పట్టణ కమిటీ సభ్యులు తాడిగడప మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.