Hot Posts

6/recent/ticker-posts

రాజకీయ వేధింపులు అరికట్టాలి ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా


అమలాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ లపై దాడులు పెరిగాయని విధుల నుంచి తొలగిస్తున్నారని, ఆవేదన వ్యక్తం చెశారు.

గత వారం క్రితం మండపేట ఫీల్డ్ అసిస్టెంట్ పై రాజకీయ వేధింపులు వలన టి రాజేశ్వరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగిందని, ఆమె గత 16 సంవత్సరాల నుండి ఆమెపై ఎటువంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహించడం జరిగిందని బెస్ట్ అవార్డు కూడా అందుకున్నారని గుర్తు చేశారు. 

ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారని కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఫీల్డ్ అసిస్టెంట్ లపై రాజకీయ వేదింపులు పెరుగుతున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షుడు జి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి నూకల బలరాం ఫీల్డ్ సంఘం రాష్ట్ర నాయకుడు పరంధామయ్య మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ వేధింపులు తక్షణమే ఆపాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.