Hot Posts

6/recent/ticker-posts

సత్యవాడ సీతారాములను దర్శించుకున్న మోడరన్ అధినేత. డాక్టర్ లయన్ జి.వి.రావు


డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కె. గంగవరం, బ్యూరో: రాష్ట్రస్థాయిలో పేరు గాంచిన సత్యవాడ శ్రీరామ నవమి వేడుకల్లో మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జి. వి. రావు, అకాడమిక్ డైరెక్టర్ కె. సాయిరాం చౌదరితో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గ్రామంలోని చెరువు వీధి, పెద్ద వీధి, కొత్తపేటలో సర్వాంగ సుందరంగా అలంకరించిన సీతారాముల ఆలయాల్లో జి.వి రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కమిటీ సభ్యులు జి. వి. రావును ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం జి.వి.రావు మాట్లాడుతూ సత్యవాడ శ్రీరామనవమి ఉత్సవాలకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. 

గ్రామస్తులందరూ సమిష్టిగా తయారుచేసిన కాగితపు పూలతో చలువ పందిళ్లను అలంకరించడం గొప్ప విశేషమన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాములను దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.