కే గంగవరం మండలం, బ్యూరో: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 117వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
పుట్టినరోజు కేకు కట్ చేసి డప్పులతో తీన్మార్ మేళాలతో విజయోత్సవాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ, వార్డ్ నెంబర్లు సత్తి దుర్గాప్రసాద్, పెట్టా వెంకటరమణ, మోర్త శ్రీనివాసరావు గ్రామ నాయకులు పోలిశెట్టి నాగేశ్వరరావు(బాబురావు) జన సైనికుడు వంశీ పేట పెద్దలు మోర్త వెంకట్రావు సత్యనారాయణ గోరింకల వాడపల్లి ఉప్పలపాటి నంది, ప్రతాప్ విజయ్ రామకృష్ణ గ్రామస్తులందరూ పాల్గొన్నారు.