Hot Posts

6/recent/ticker-posts

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దైవ సేవకుల నినాదాలతో దద్దరిల్లిన అయినవిల్లి మండలం


అయినవిల్లి: పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం రాష్ట్రం తీవ్ర విషాదఛాయలో మునిగిపోయింది. ఇది యాక్సిడెంట్ వల్ల కలిగిన మరణం కాదని కావాలనే కొంతమంది ఆయన హతమార్చారని క్రైస్తవ సంఘాలు అనుమానం తెలుపుచున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వం సరైన దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాయి. ఆ క్రమంలోనే అయినవిల్లి మండలం పాస్టర్స్ సంఘములు మరియు విశ్వాసులు ముక్తేశ్వరం పెట్రోల్ బంకు యొద్ద నుండి ఎం ఆర్ ఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.


తొత్తరమూడి గ్రామ సర్పంచ్ అడ్వకేట్ వార నరసింహమూర్తి మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణ వార్త వినగానే చలించిపోయానని ఆయన అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ప్రభుత్వం సరైన దర్యాప్తు చేసి ఈ సంఘటనకు పాల్పడిన దోషులను పట్టుకోవాలని క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకి దైవ సేవకులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. అయినవిల్లి మండలం ఎమ్మార్వో సిహెచ్ నాగలక్ష్మి, పోలీస్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ శాస్త్రి కి వినతిపత్రం సమర్పించారు.


ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు పాస్టర్స్ ఎం యెహోషువ, ఏసు బాబ్జి, పి. ఏసు పాదం, ఎండి ఆనంద్ కుమార్, పి రత్నరాజు, ఎన్ పాల్, ప్రకాశరావు, సామ్యూల్ రాజు, అజిత్, తిమోతి, ఇస్సాకు, రాజ్ కుమార్, శేఖర్ విజయరాజు, సాల్మన్ రాజు, జోషి, అభిషై, శ్రీ రెడ్డిరాణి, విమల కుమారి, ఎస్తేరు జ్యోతి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.