*భారీ ర్యాలీకి తరలివచ్చి కదం తొక్కిన వేలాది మంది క్రైస్తవులు..
*హత్య అని నిర్ధారణ అయితే దోషులను కఠినంగా శిక్షించాలి..
ఐ. పోలవరం: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఐ. పోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కె. ఎలీషా రాజు, వైస్ ప్రెసిడెంట్ ఆర్. జాన్సన్, మాజీ వైస్ ప్రెసిడెంట్ గంటి బుజ్జిబాబు, ఎస్.సామ్యూల్ పిన్ని, బి.శాంతిరాజు డిమాండ్ చేశారు.
మంగళవారం మురమళ్ళ మార్కెట్ సెంటర్ నుంచి, ఐ. పోలవరం తహసిల్దార్ కార్యాలయం వరకు పాస్టర ప్రవీణ్ మృతికి నిరసన తెలియజేస్తూ ఐ. పోలవరం మండల పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీని ఉద్దేశించి ఫెలోషిప్ ప్రెసిడెంట్ కె. ఎలీషా, మాజీ వైస్ ప్రెసిడెంట్ జి. బుజ్జిబాబు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేశారనే నమ్ముతున్నామని, ఒక దైవ జనుడిని హత్య చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటే అన్నారు. తొలి దినాల్లో అపోస్తలులను చెరలో వేసి సువార్తను అపుదాం అనుకున్నారు, కాని చెరలో సువార్తికులను బంధించారు కానీ, సువార్త ఆగలేదని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును సీఐడీకి అప్పగించాలని అన్నారు.
ఒక్క ప్రవీణ్ పగడాలను చంపితే వందలాది మంది ప్రవీణ్ లు పుట్టుకొస్తారన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవ రక్షణకు భరోసా ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు సరేళ్ళ ఇమ్మానియేల్, వంగలపూడి జోసెఫ్, సామ్యూల్ రెడ్డి, మండల ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ జాన్సన్, సెక్రెటరీ సునీల్ శాస్త్రి, జాయింట్ సెక్రెటరీ సీమోను పేతురు, జాయింట్ ట్రెజరర్ పి. సూర్య ప్రకాష్, యూనియన్ పెద్దలు నేలపాటి సామ్యూల్, పి. సామ్యూల్ రాజు, పి. జాన్ ట్రూ, పి. చంద్రజాన్, పి. పరంజ్యోతి, జీవన్, విలియం కేరి, పాల్ తిమోతి, కుంకి దానియేలు, మోకా శబ్దం, మోర్త దానియేలు, సవరపు లాజరు, జాన్ విక్టర్, రత్నం రాజు, విన్నీ ప్రత్యుష్, డి. సాల్మన్ రాజు, ప్రసన్న, దోమ సాల్మన్ రాజు, దయాసాగర్, గంటి విక్టర్ బాబు వందలాదిమంది క్రైస్తవులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.