Hot Posts

6/recent/ticker-posts

డా.బి.ఆర్. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్.


ఏలూరు జిల్లా, ఏలూరు: డా.బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ సమీపమున ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) , జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్, ఆర్.టి.సి. విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 
 
అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ.నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో రాజ్యాంగం ద్వారానే సమర్థవంతమైన పరిపాలన సాగుతోందని,అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయoటే దానికి కారణం డా.బి.ఆర్ అంబేద్కర్ మార్గదర్శకాలవల్లేనని ఆయన పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 75 సార్లు రాజ్యాంగ సవరణ చేసిందని అయితే బడుకు,బలహీనవర్గాలకు మేలు చేసే ఏ ఒక్క సవరణ చేయలేదన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు అంబికా కృష్ణ, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, పలువురు కార్పోరేటర్లు, డిఎంహెచ్ఓ డా. ఆర్. మాలిని. డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.