Hot Posts

6/recent/ticker-posts

అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్శనికుడు డా. బి.ఆర్ అంబేద్కర్


అణగారిన వర్గాల అభ్యున్నతే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లక్ష్యం - అంబేద్కర్ జయంతి సందర్భంగా ములక్కాయ పాడు గ్రామంలోని పేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం ఉచితంగా మేకలను అందిస్తున్నట్లు ప్రకటించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 

దెందులూరు/ఏలూరు:/పెదవేగి: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్శనికుడు డా. బి.ఆర్ అంబేద్కర్ అని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ పరిధిలోని ములక్కాయపాడు గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని మారుమూడి థామస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. మార్ముడి థామస్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఎంతో దాతృత్వం కలిగిన నాయకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని, ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండే వ్యక్తిగా, ప్రజల పట్ల ఎంతో దాతృత్వాన్ని చూపించే వ్యక్తిగా, గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే కావడం దెందులూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అని మారూముడి థామస్ అన్నారు.

అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలమాలవేసి ఘన నివాళులర్పించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ "సమాజంలో అన్ని వర్గాలకు డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితం ఆదర్శనీయం అని, ప్రతి కూల పరిస్థితులను ఎదిరించి, నిలబడి, ఉన్నత చదువులు చదివి , భారత దేశానికే రాజ్యాంగాన్ని రచించే స్థాయికి చేరిన ఆయన జీవితం ప్రతి యువతకు ఆదర్శనీయం అని తెలిపారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద గురుకులాలను ప్రారంభించారని నేడు ఈ గురుకులాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాదిమంది పేద కుటుంబాల పిల్లలకు విద్యను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ తెలిపారు. 

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ప్రాజెక్టును కూడా దెందులూరు నియోజకవర్గం లో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు, ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బంగారు కుటుంబాలను కూడా గుర్తించడం జరుగుతుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ములక్కాయపాడు గ్రామంలోని 20 పేద కుటుంబాలకు మేకలను జీవనోపాధి నిమిత్తం ఉచితంగా అందించనున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు..

ములక్కాయపాడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహన్నీ ఏర్పాటు చేయడానికి సహకరించిన స్థానిక కూటమి నాయకులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, టిడిపి సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, దళిత సంఘాల నాయకులు మారుమూడి థామస్, కాపుదాసి రవి, ప్రసాద్, నల్లమిల్లి శంకర్, సహా జయ బాబు, వెంకటేశ్వరరావు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.