Hot Posts

6/recent/ticker-posts

రూ. 1346కే ఫ్లైట్ టికెట్.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్..


INDIA, ANDRAPRADESH, TELANGANA: విమానంలో ప్రయాణించాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి? ఆకాశంలో విహరిస్తూ దూర ప్రయాణాలు చేయాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే, విమాన టికెట్ల ధరలు కొన్నిసార్లు ఆ కలకు అడ్డుగా నిలుస్తాయి. కానీ ఇప్పుడు మీ కల నిజం కాబోతోంది. దిగ్గజ విమానయాన సంస్థలు ఇటీవలి కాలంలో ప్రత్యేక సందర్భాలలో అదిరిపోయే ఆఫర్లతో మీ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, రాఖీ, హోలీ, క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి ప్రత్యేక రోజుల్లో అదిరిపోయే సేల్స్‌ను అందించాయి. ఇక ఇప్పుడు ఇండిగో కూడా సమ్మర్ స్పెషల్ సేల్ లాంఛ్ చేసింది. ఇక తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా సమ్మర్ ఫ్లాష్ సేల్‌తో మీ జేబుకు చిల్లు పడకుండా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.


వేసవి సెలవులు మొదలయ్యాయి కదా, మీ ప్రయాణాలను మరింత సరసమైన ధరలో ప్లాన్ చేసుకునేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'సమ్మర్ ఫ్లాష్ సేల్' పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో టికెట్ల ధరలు కేవలం రూ. 1346 నుంచే ప్రారంభమవుతున్నాయి! సాధారణంగా బస్ టికెట్ ధరలు కూడా కాస్త దూర ప్రయాణాలకు ఇదే రేంజ్‌లో ఉంటాయన్న సంగతి తెలిసిందే.

ఆఫర్ వివరాలు..
ఎక్స్‌ప్రెస్ లైట్ (Xpress Lite) ఛార్జీలు: రూ. 1346 నుంచి ప్రారంభం
ఎక్స్‌ప్రెస్ వాల్యూ (Xpress Value) ఛార్జీలు: రూ. 1498 నుంచి ప్రారంభం
బుకింగ్ వ్యవధి: ఏప్రిల్ 15, 2025 (00:00 గంటలు) నుంచి ఏప్రిల్ 18, 2025 (23:59 గంటలు) వరకు మాత్రమే!
ప్రయాణ వ్యవధి: ఏప్రిల్ 21, 2025 (00:00 గంటలు) నుంచి సెప్టెంబర్ 20, 2025 (23:59 గంటలు) వరకు

ఈ ధరల్లో బేస్ ఫేర్, పన్నులు, విమానాశ్రయ ఛార్జీలు అన్నీ కలిసే ఉంటాయి. అయితే, సౌకర్య రుసుములు అంటే కన్వీనియెన్స్ ఫీజు, ఇతర అనుబంధ సేవలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ (www.airindiaexpress.com) లేదా వారి మొబైల్ అప్లికేషన్ ద్వారా లాగిన్ అయిన లాయల్టీ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, లాగిన్ అయిన సభ్యులకు కన్వీనియెన్స్ రుసుము ఉండదని గుర్తుంచుకోవాలి.

ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొదటిగా బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అన్ని తేదీలు, విమానాలు, రూట్లలో సీట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు అమ్ముడైతే, బుకింగ్‌కు అందుబాటులో ఉన్న సాధారణ ధరలు కనిపిస్తాయి.

కాబట్టి, వేసవిలో విహరించాలని కలలు కంటున్నారా? అయితే, ఈ బంపర్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చెబుతోంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో మీ టికెట్‌ను బుక్ చేసుకోవాలని చెబుతోంది.