ANDRAPRADESH: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి కోడలు .. పల్లె సింధూర రెడ్డి గత ఎన్నికలలో విజయం దక్కించుకున్నారు. కుటుంబ రాజకీయాలకు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రసిద్ధి చెందాయి. వారసులను రంగంలోకి దించడం.. గెలిపించుకోవడం.. వంటివి సర్వసాధారణం. ఇలానే ఏపీలోనూ.. 2024 ఎన్నికల్లో చాలా వరకు నియోజకవర్గాల్లో వారసులు..కుటుంబ సభ్యులు విజయం దక్కించుకున్నారు.
అయితే.. ప్రజలు ఎన్నుకొన్న నాయకులు ఒకరైతే.. ప్రజలపై పెత్తనం చేస్తున్నవారు మరొకరు అన్నట్టుగా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి. ఈ పరిస్థితి పార్టీలకు.. ప్రభుత్వానికి మంచి చేస్తే.. ఓకే, కానీ.. వారు చేస్తున్న పనులతో సీఎం చంద్రబాబు కు చెడ్డ పేరు వస్తోందన్నది సీనియర్ల ఆవేదన.
ప్రస్తుతం వెలుగు చూసిన కొన్ని పరిణామాలను బట్టి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో సీనియర్ నాయకుడు.. గత నెల ఆఖరు వరకు ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య విజయం దక్కించుకున్నారు. ఈమె రాజకీయాలకు కొత్తకాదు. కుటుంబమే రాజకీయాల్లో ఉంది. పైగా.. 2019లోనూ ఆమె పోటీ చేశారు. అప్పట్లో ఓడిపోయినా.. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. కానీ.. పట్టుమని 10 వారాలు కూడా గడవకుండానే.. ఇక్కడ ఆమె భర్త హవా చలాయిస్తున్నారన్నది టాక్. అన్ని విషయాల్లోనూ.. ఆయనే చూసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో దివ్య కన్నా.. ఆమె భర్త పేరు మార్మోగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి కోడలు .. పల్లె సింధూర రెడ్డి గత ఎన్నికలలో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆమె ప్రమేయం ఏమీ కనిపించకుండానే.. ఇక్కడ కొన్ని వ్యవహారాలు సాగుతున్నాయి. ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో రఘునాథ రెడ్డి, ఆయన చిన్న కుమారుడు డీల్ చేస్తున్నారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అయితే.. ఆయా విషయాల్లో పార్టీకి మేలు జరగకపోగా.. విమర్శలు వస్తున్నాయి.
ఇక, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనికీలకమైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీ కి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో ఆయనను తప్పించిన చంద్రబాబు.. సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి అవకాశం ఇచ్చారు. ఆమె విజయం దక్కించుకున్నారు. కానీ.. పెత్తనం మాత్రం.. కొన్నాళ్లుగా ఆమె సోదరులు.. రాజేష్, రంజిత్‌లే చేస్తున్నారు.
వారే షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ.. ఇసుక, మద్యం వ్యవహారాల్లో భారీగానే వెనుకేసుకుంటున్నారని టాక్. ఈ పరిణామాలు.. ఇటు పార్టీకి.. అటు సీఎంగా చంద్రబాబుకు కూడా మచ్చ తెచ్చేవిగా ఉన్నాయని.. సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆయన పట్టించుకుని సరిదిద్దకపోతే.. ప్రజల్లో వ్యతిరేక భావన పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు..