Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడిలో రెండు రోజుల అంతర్జాతీయ వర్క్ షాప్


ఏలూరు జిల్లా, చింతలపూడి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో రెండు రోజుల అంతర్జాతీయ వర్క్ షాప్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ డా. పి శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది. 

దీనిలో మొదటి రోజు వర్క్ షాప్ లో ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో మొదటగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి శ్రీనివాసరావు అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. మొదటి విభాగంలో ఆన్లైన్లో డాక్టర్ హీరో ఓహ్ హేమ అమెరికా నుండి దంత క్షయం, దాని నివారణ చర్యలు గురించి వివరంగా మాట్లాడారు.

డా ఏ. నారాయణరావు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకో కూడదో, ఏ ఆహారంలో ఎంత శాతం కొవ్వు పదార్థం ఉందో వివరంగా చెప్పడం జరిగింది. వర్క్ షాప్ కన్వీనర్ డాక్టర్ సయ్యద్ మీర్ హసీం మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది. కళాశాల స్థలదాత నందిగం వివేకానంద చౌదరి కుమారుడు నందిగం రాఘవ చౌదరి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి క్రమశిక్షణ కలిగిన జీవనశైలి ఉండాలని, సదస్సులో ఉన్న వారందరితో ముచ్చటించారు. వారు వ్రాసిన పుస్తకం అవార్డును సంతరించుకుంది. ఆ పుస్తకాన్ని కళాశాలకు జ్ఞాపికంగా కళాశాల ప్రిన్సిపాల్ కి ఇవ్వడం జరిగింది.  

డా. డి తులసిప్రియ ఆరోగ్య పరమైన సవాళ్లు గురించి చెబుతూ మంచి సూచనలు, సలహాలు ఇవ్వడమే కాక విద్యార్థులతో చిన్నచిన్న యాక్టివిటీస్ చేయించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. డాక్టర్ నవీన్ చంద్ర విజయవాడ ఎముకల నిపుణులు మాట్లాడుతూ ఎముకలు గట్టిగా ఉండాలంటే క్యాల్షియం, డి విటమిన్ ఎక్కువగా అవసరం అవుతుందని వయసు మీద పడేసరికి ఎక్కువగా ఈ సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉంటారని వాటికి తగిన నివారణ ఎలాంటిదో వారి మాటల్లో వివరించడం జరిగింది. కో కన్వీనర్ డా. బి సరస్వతి వందన సమర్పణతో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.