పలు దేవాలయాల్లో మంత్రి సుభాష్ తండ్రి సత్యం పూజలు
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం, బ్యూరో: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం కూటమి నాయకులతో కలిసి రామచంద్రాపురం నియోజకవర్గంలోని చోడవరం, భీమక్రోసు పాలెం, తోటపేట, తాళ్లపొలం, చప్పిడివారి సావరం తదితర గ్రామాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని తరించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముని యొక్క గొప్పతనం కోసం వివరిస్తూ హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది "రామతత్వం" అని, కష్టంలో కలిసి నడవాలన్నది "సీతతత్వం" అని, కుటుంబ బాధ్యత పంచుకోమన్నది "లక్ష్మణతత్వం" అని, నమ్మిన వారికోసం ఎంతైనా చెయ్యాలని "ఆంజనేయతత్వం" అనే పరమార్థం, నిగూడ అర్థం దాగి ఉందన్నారు.
భార్య కోసం భర్త... అన్న కోసం తమ్ముడు... స్వామి కోసం భక్తుడు... ఈ అపురూప బాంధవ్యాల సమ్మేళనమే రామాయణం అన్నారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రామచంద్రపురం నియోజవర్గం లోని ప్రజలంతా శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో, కృప కటాక్షములతో.. సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సత్యవాడ గ్రామంలో రాములవారిని దర్శించుకున్న వైసిపి ఎమ్మెల్సీ తోట
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కే గంగవరం, బ్యూరో: మండలంలోని సత్యవాడ గ్రామంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాములవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. డా.బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మరియు రామచంద్రపురం నియోజవర్గం ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.