రామచంద్రపురం నియోజకవర్గ నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కె.గంగవరం, బ్యూరో: రామచంద్రపురం నియోజవర్గంలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువుకుని ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆశయం, ఆదేశాలు మేరకు "సత్యం వాసంశెట్టి ఫౌండేషన్" చైర్మన్ వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి స్థానిక విఎస్ఎం కళాశాలలో, అలాగే కె.గంగవరం మండలం పామర్రు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు.
ఈ జాబ్ మేళాలో సుమారు 700 మందికి కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ ఏరియాలో పనిచేసే వారికి రూ.12,400/- వరకు జీతం, ఉచిత భోజన సదుపాయం, ఈ ఎస్ ఐ, పిఎఫ్ కటింగ్ లుంటాయన్నారు. విశాఖపట్నం ప్రాంతంలో పని చేసే వారికి రూ.15 వేలు నుంచి 18 వేలు వరకు జీతం ఇస్తారని, భోజన సౌకర్యం, ఈఎస్ఐ, పిఎఫ్ లుంటాయన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులైన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు పదవ తరగతి, ఇంటర్ పాసైన మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలుతో హాజరుకావాలని మంత్రి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం తెలిపారు.