ANDRAPRADESH: తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒకరు. బీజేపీ ఎమ్మెల్యే కం శాసనసభాపక్ష నేత మరొకరు. తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒకరు. బీజేపీ ఎమ్మెల్యే కం శాసనసభాపక్ష నేత మరొకరు. ఈ ఇద్దరి మధ్యన ప్రచ్ఛన్న సంఘర్షణ ఉందని ప్రచారం ఉంటూ వచ్చింది. అయితే ఇపుడు ఓపెన్ అయిపోయారు. ముఖ్యంగా గంటా విష్ణు దూకుడుకు ఉత్తర నియోజకవర్గంలో బ్రేకులు వేస్తున్నారు అన్న పుకారులు షికారు చేస్తున క్రమంలో అంతా చూస్తూండగానే విష్ణు మీద గంటా ఫైర్ అయిన తీరు మరో కొత్త చర్చకు దారి తీస్తోంది. నా నియోజకవర్గంలో మీ జోక్యం ఏమిటి అని గంటా విష్ణుని సూటిగానే నిలదీశారు. భీమిలీలో ఉన్న ఫిల్మ్ నగర్ క్లబ్ లీజు వ్యవహరంలో మీకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. అసలు ఈ లీజు వ్యవహరం కలెక్టర్ దృష్టిలోకి తీసుకుని రావడమేంటని కూడా ఫైర్ అయ్యారు.
మీరు ఇలా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే సహించేది లేదని కూడా స్పష్టం చేశారు. దానికి విష్ణు మీరు అందుబాటులో లేరు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది అని వివరించే ప్రయత్నం చేశారు. అయినా గంటా శాంతించలేదు. పైగా పెద్దగా కేకలు వేస్తూ విష్ణు మీద విరుచుకుపడ్డారు. ఇదంతా గంటా తన కారులో కూర్చుని ఉంటే విష్ణు ఆయన కారుకు దగ్గరగా ఉంటూ నిలబడి సమాధానం చెబుతున్నారు. గంటా గట్టిగా మాట్లాడుతూంటే విష్ణు నెమ్మదిగా మాట్లాడుతుండడం జరిగింది. ఇదంతా వీడియోగా సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయింది. సాటి ఎమ్మెల్యే మీద రోడ్డు మీద గంటా ఈ విధంగా వ్యవహరించడంతో అంతా ఆశ్చర్యపోయారు. జనాలు సైతం ఇదంతా చూస్తూండిపోయారు. ఇక సాటి నాయకులు గంటాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన ఆగకుండా కారులో వెళ్ళిపోవడమూ జరిగింది.
అసలు ఎందుకు ఇలా గంటా ఆవేశపడ్డారు, ఎందుకు విష్ణు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్నది కనుక చూస్తే రకరకాలుగా ప్రచారం సాగుతోంది. కూటమి ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని అర్థం అవుతోంది. విష్ణు నియోజకవర్గం ఉత్తరంలో గంటా అనుచరులు జోక్యం చేసుకుంటున్నారు. ఈ రోజుకీ వారి మాటే చెల్లుబాటు అవుతోంది అన్న బాధ అయితే బీజేపీ నేతలలో ఉంది. మరి దానికి బదులు అన్నట్లుగా గంటా భీమిలీ నియోజకవర్గంలో విష్ణు వేలు పెట్టారా అన్నది చర్చ. అమ్రో వైపు చూస్తే ఫిల్మ్ నగర్ క్లబ్ లీజు వ్యవహారం కూడా ఏమిటి అన్నది అంతా అనుకునే నేపథ్యం ఉంది. ఫిల్మ్ నగర్ క్లబ్ విషయంలో కూడా ఎందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడి ఆసక్తి చూపుతున్నారు అన్నది మరో చర్చగా ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే కూటమి ఎమ్మెల్యేలు ఇలా తమ విభేదాలను బాహాటం చేసుకోవడం మీద చర్చ సాగుతోంది. ఏమైనా ఉంటే నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పోయేది కదా అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కార్యకర్తల మధ్య కూడా అపోహలకు దారి తీస్తుందని అంటున్నారు. అంతే కాదు కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న సంగతి కూడా అందరికీ చెప్పినట్లు అవుతుందని అంటున్నారు. ఒక వైపు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ళ పాటు కూటమి కలిసి ఉండి అధికారంలో కొనసాగుతుందని ప్రకటనలు చేస్తున్నారు. అయితే పరిస్థితి చూస్తే అలా లేదని అంటున్నారు. ఈ విధంగా వివాదాలు పెంచుకుంటూ పోతే కూటమి ఇబ్బందులలో పడుతుందని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ కలిసి కూర్చుని కూటమిలో ఐక్యతకు దిశానిర్దేశం చేయాల్సి ఉందని అంటున్నారు.