Hot Posts

6/recent/ticker-posts

మరోసారి విద్యార్థుల మనసు గెలుచుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


కృతజ్ఞతలు తెలిపిన 250 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు


ఏలూరు/దెందులూరు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి తరగతులు చదువుతూ సైన్స్ పట్ల మరింత ఆసక్తి కలిగిన 250 విద్యార్థులను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ తరపున వారందరిని బుధవారం రాత్రి ఏలూరు నుంచి హైదరాబాద్ నగర పర్యటనకు పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది.

అయితే గతంలో ఇదే విధంగా విశాఖపట్నం పర్యటనకు ఏలూరు జిల్లా విద్యార్ధులు వెళ్లిన సమయంలో రాత్రి సమయంలో విద్యార్థులంతా కలిసి ఒకచోటకు చేరుకుని బయలుదేరే సమయంలో బస్సులు కోసం రోడ్ల వద్ద, మైదానాల్లో ఎదురు చూస్తూ చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు

అయితే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చారు. ఏలూరు లోని అశోక్ నగర్ వద్ద గల కెపిడిటీ హైస్కూల్ ప్రాంగణం నుంచి విద్యార్థులకు స్టార్టింగ్ పాయింట్ గా నిర్ణయించాలని, అదేవిధంగా బస్సులు వచ్చే వరకు కూడా స్టార్టింగ్ పాయింట్ కు చేరుకున్న విద్యార్థులు అంతా కూడా రాత్రి సమయం వల్ల ఎలాంటి ఇబ్బంది పడకుండా పాఠశాల ఆవరణలో ఉన్న ఆడిటోరియం లోపల  కూర్చునే లాగ వారికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆడిటోరియం నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్లు చేయటంతో పాటు విద్యార్థులు అందరికీ కూడా తాగటానికి జ్యూస్ ప్యాకెట్లు అందించేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ లో విద్యార్థులకు , వారితో పాటు ఉండే సిబ్బంది అందరికీ కూడా హైదరాబాద్ లోని ప్రముఖ ప్యారడైజ్ బిర్యాని నీ డిన్నర్ గా ఏర్పాటు చేయాలని, అందుకు అయ్యే ఖర్చు అంతా కూడా తాను వ్యక్తిగతంగా చెల్లిస్తానూ అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.



అనంతరం బుధవారం రాత్రి ఆడిటోరియం వద్దకు స్వయంగా చేరుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ విద్యార్థుల్లో సైన్స్ పట్ల మరింత అవగాహన పెంచుకోవాలని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ శాస్త్రీయ అధ్యయన యాత్రను  విద్యార్థులు మరింత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ఈ అధ్యయన యాత్రలో భాగంగా యాత్రకు వెళ్తున్న 250 మంది విద్యార్థుల్లో ప్రతి పదిమందికి ఒక గైడ్ టీచర్ను నియమించడం జరిగిందని అదేవిధంగా విద్యార్థులు క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చేలాగా కూడా గైడ్ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ అధ్యయన యాత్రలో విద్యార్థులకు హైదరాబాద్ నగరంలోని సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా ప్లానిటోరియం, చార్మినార్ తో పాటు అనేక దర్శనీయ ప్రాంతాలను సైతం విద్యార్థులకు చూపించడం జరుగుతుందని, విద్యార్థులకు ఈ యాత్ర జీ వారి జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. 

ప్రతి అంశాన్ని కూడా ఎంతో సుదీర్ఘంగా పరిశీలించడం, పరిశోధించడం, విశ్లేషించడం వంటి అనేక అంశాలను సైన్స్ మనకు నేర్పిస్తుందని, ఈరోజు నిత్యం మన జీవన విధానంలో జరిగే ప్రతి పని నుంచి, అంతరిక్షంలో జరిగే అద్భుతాలను సైతం విశ్లేషించగలిగేది కేవలం సైన్స్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని, కాబట్టి విద్యార్థి దశలోనే మీరంతా కూడా సైన్స్ పట్ల ఆసక్తి కలిగి ఉండడం ఎంతో అభినందనీయమని విద్యార్థులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందించారు...

అనంతరం బుధవారం రాత్రి హైదరాబాద్ నగరానికి 5బస్సుల్లో బయలుదేరి వెళ్తున్న ఏలూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శాస్త్రీయ అధ్యయన యాత్రను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.