Hot Posts

6/recent/ticker-posts

ఏప్రిల్ 20వ తేదీన మెగా డి‌ఎస్‌సి నోటిఫికేషన్ విడుదల.. మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు..


ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృడ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్రవ్యాప్తంగా 16,437 ఉపాధ్యాయ ఉధ్యోగాలిచ్చేందుకు మెగా డి‌ఎస్‌సి నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  


ఏప్రిల్ 20వ తేదీన మెగా డి‌ఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసియున్నారని,  దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యందు 1,035 ఉపాధ్యాయ పోస్టు ఖాళీలు ఉన్నయన్నారు.  అర్హత కలిగిన ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు సి.బి.టి. విధానంలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు.  

మెగా డి‌ఎస్‌సి – 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జి‌ఓలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరములు 20.04.2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్  (https://cse.ap.gov.in మరియు https://apdsc.apcfss.in) నందు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.