Hot Posts

6/recent/ticker-posts

పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


దెందులూరు: "రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అనునిత్యం కష్టపడి జీవించే మత్స్యకారుల జీవితాల్లో సంక్షేమం సాకారం అవుతుందని, దేశ మత్స్య సంపదలో 29% మన రాష్ట్రానిదే అని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మత్స్యకారులకు అండగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని" దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.


దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పలువురు నియోజకవర్గ కోటమి నాయకులు అధికారులు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ "ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్య కారుల కోసం మత్స్య కారుల సేవలో పథకం ద్వారా వేట నిషేధ సమయంలో రూ. 20,000 సాయం విడుదల చేయటం ద్వారా రాష్ట్రంలోని 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. 

అదే విధంగా ఇటు కొల్లేరుతో పాటు రాష్ట్రంలోని మత్స్యకార గ్రామాలు టీడీపీకి అండగా నిలబడ్డాయి అని,  సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి మత్స్య కారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించటం జరిగిందని తెలిపారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచామని, ప్రజలందరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని తెలిపారు. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడిందా? అని ప్రశ్నించారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతిని ప్రవేశ పెట్టింది అని గుర్తు చేశారు. 

2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టాము అని, అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా ఇచ్చామనీ, రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలనెలా పింఛన్లు అందిస్తున్నామనీ తెలిపారు. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తున్నామని,  వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నాం అని ఎమ్మెల్యే తెలిపారు. 

చేపల ఎగుమతుల్లో ఏపీ టాప్
రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయి అని, చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందువరుసలో ఉందనీ అన్నారు.. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్యసంపదలో 29 శాతం మన రాష్ట్రం నుంచే ఉంటోందనీ, ఏపీ నుంచే 32 శాతం మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయిఅని,  మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది అని ఎమ్మెల్యే తెలిపారు. 

చేపల పెంపకం వల్ల వ్యాపారులకు ఎన్నో లాభాలున్నాయి అని, అలాగే పోషకాల కోసం  ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తినాలి అని, మనుషుల్లో తెలివితేటలు, పిల్లల మెదడు చురుకుగా పనిచేయాలంటే చేపలు తినాలి అని మత్స్య శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.