Hot Posts

6/recent/ticker-posts

చౌదరి హత్యలో పోటుకు రూ.2 లక్షలు ఫిక్స్ చేసి ఏసేశారట!.. వెలుగులోకి కొత్త విషయాలు


ANDRAPRADESH: ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య ఉదంతానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్య జరిగిన రెండు వారాలు దాటుతున్నా.. ఈ హత్యకు కీలక సూత్రధారితో పాటు.. దారుణ హత్య చేసిన వారిలో కీలకవ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు మూడు నెలల ప్లానింగ్.. రెండు వారాలకు పైనే రెక్కీ నిర్వహించినన తర్వాతే తమ ప్లాన్ ను అమలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

ఈ హత్యకు సంబంధించి మరో కీలక అంశాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసేందుకు మాట్లాడిన సందర్భంగా.. ఎన్ని కత్తి పోట్లు ఎక్కువ వేయగలిగితే.. అన్ని వేయాలని.. ఒక్కో కత్తి పోటుకు రూ.2 లక్షలు చొప్పున ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. నిందితులకు.. సూత్రధారులకు మధ్య నడిచిన లావాదేవీలు పూర్తిగా వెల్లడి కావాలంటే.. కీలక సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది.

పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. హత్య జరిగిన వెంటనే ఇద్దరు కీలక వ్యక్తులు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి కోసం హైదరాబాద్.. విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాను దిగిన అన్నీ రంగాల్లో దూసుకెళ్లిపోతున్న వీరయ్యకు వ్యతిరేకలందరిని ఒక తాటి మీదకు తీసుకొచ్చి.. మర్డర్ ప్లాన్ చేసినట్లుగా భావిస్తున్నారు.

వీరయ్య హత్య కేసులో కీలక నిందితుడికి వైసీపీకి చెందిన ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతడికి పేకాట ఎక్కువగా ఆడే అలవాటు ఉంటారని.. కొందరు వైసీపీ నేతలు అయితే.. నిందితుడి ఇంటికి వెళ్లి మరీ తీసుకెళతారని చెబుతున్నారు. అంతేకాదు జిల్లాకుచెందిన మాజీ ఎమ్మెల్యేతోనూ సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లోనూ ఇతడికి కీలక స్థానాల్లో ఉండే అధికారులతో లింకులు ఉన్నట్లుగా సమాచారం. నిందితుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి నెట్ వర్కు ఉందని అనుమానిస్తున్నారు.

హత్యకు ప్లాన్ చేసిన సందర్భంగా నిందితులు త్రోవగుంట సమీపంలో ఒక లాడ్జిని తీసుకొని వీరయ్య చౌదరి రోజువారీ కదలికల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే హత్యకు కీలక నిందితుడితోపాటు.. దారుణంగా ప్లాన్ చేసిన వాడు దొరికితేనే.. ఈ హ్యత్య అసలు ఉద్దేశాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.