Hot Posts

6/recent/ticker-posts

టీ నర్సాపురం బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు


ఏలూరు జిల్లా, టి. నరసాపురం: మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు శుక్రవారం నాడు టీ నర్సాపురం బీసీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా బిసి సంఘం రాష్ట్ర నాయకులు కొండపల్లి రవి, సామాజిక కార్యకర్త సింగరేణి కార్మిక నాయకులు యస్ డి నా సర్ పాషా, టి నరసాపురం గౌడ సంఘం అధ్యక్షులు రచయిత మరీదు వెంకట నాగేశ్వరరావు లు మాట్లాడుతూ ఈ ప్రపంచంలోనే లేదా ఈ భూమి మీద మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు బుద్ధుడు అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రలోనే మొట్ట మొదటి సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. 

ఈ ఆధునిక సమాజంలో పీడిత, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. సమాజంలో మహిళల పట్ల వివక్ష, అంటరానితనం, సాంఘిక దురాచారాలకు కుల వివక్షకు వ్యతిరేకంగా రెండు వందల సంవత్సరాల క్రితమే పోరాడి అనేక విజయాలు సాధించిన జ్యోతిబాపూలే దేశంలోని పీడిత వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. 

ప్రతి ఒక్కరు మహనీయుల అడుగుజాడల్లో వారి ఆలోచనలతో సమాజ శ్రేయస్సుకై పాటుపడాలని ఆకాంక్షించారు. జ్యోతిబాపూల్ అభిమానులు నాయకులు పెద్దిన సత్యనారాయణ, కాసాని వెంకట్రావు, పాలేటి సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు నందిపాం దుర్గారావు పలగాని పోతురాజు, పబ్బుజయరాజు, చిన్న బుజ్జి, సిహెచ్ బాబురావు,ఎస్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.