డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం/అంబాజీపేట: మండలంలోని మాచవరం ప్రధాన రహదారిని ఆనుకొని దళిత వాడల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాపు ను తొలగించాలని దళిత మహిళలు ధర్నా నిర్వహించారు.
పలుమార్లు అధికారులు వద్దకు వెళ్లిన స్పందన కరువైందని మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆగదని వారు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం చెంతనే బ్రాందీ షాపు ఏర్పాటుచేయడం పై దళితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణమే బ్రాందీ షాపు తొలగించాలని దళిత మహిళల డిమాండ్ చేస్తున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎట్టి పరిస్థితుల్లోను మాకు న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించేది లేదంటూ దళితులు ముక్తకంఠంతో నినదించారు.