ప్రవీణ్ మరణంపై దర్యాప్తు వేగవంతం చెయ్యాలి..
ముమ్మిడివరం: పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికొన, ఐ పొలవరం, ముమ్మిడివరం, మండల పాస్టర్ రాష్ట్రం తీవ్ర విషాదఛాయలో మునిగిపోయింది. ఇది ఫెలొషిప్ అధ్యర్యంలో నిరసన శాంతి ర్యాలి నిర్వహించారు.
ఈసందర్బంగా పలువురు పాస్టర్ లు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణం యాక్సిడెంట్ వల్ల కలిగిన మరణం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని, ఆయనది హత్యా.. లేదా ప్రమాదమా అని క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముమ్మిడివరంలో పెద్ద ఎత్తున నినాదాలతో మండలంపాస్టర్స్, సంఘములు, విశ్వాసులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ప్రబుత్వం సరైన దర్యాప్త చెపట్టి క్రైస్తవ సంఘాలకి దైవ సేవకులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. అనంతరం ముమ్మిడివరం తాహిశాల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ వజ్రపు జోసఫ్, రెవరెండ్ సరేళ్ళ ఇమ్మానుయేల్, రెవరెండ్ ఈతకోట పాల్ రాజ్, ఐ పోలవరం మండలం అధ్యక్షులు రెవరెండ్ వీధి ప్రేమానంద పాల్, కాట్రేనికోన మండలం అధ్యక్షులు రెవరెండ్ గెడ్డం బాబి, కాట్రేనికోన మండలం సిఆర్పిఎఫ్ అధ్యక్షులు రెవరెండ్ పాల్ ప్రసాద్మరియు కోనసీమ జిల్లా నాయకులు రెవరెండ్ వివి సామ్యూల్ జ్యోతి, రెవరెండ్ యూ ప్రసాద్, సిపిఎం నాయకులు దుర్గాప్రసాద్, కెవిపిఎస్ నాయకులు తులసి రావు తదితరులు పాల్గొన్నారు.