Hot Posts

6/recent/ticker-posts

శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యసన్నిధిలో వైభవంగా విశేష పూజలు


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణ ఇలవేల్పు దేవత శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి 61 వ ఉగాది వార్షిక జాతర జరుగుతున్న క్రమంలో ఎనిమిదవ రోజైన మంగళవారం  అమ్మవారికి లక్ష పుష్పార్చన ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ( పండు) తో కూడిన ఆలయ కమిటీ  ఆధ్వర్యంలో  వైభవంగా నిర్వహించింది.


లక్ష పుష్పార్చన నిర్వహించడం ద్వారా భక్తులు సకలశుభాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు, కార్యసిద్ధి పొందుతారని అర్చక స్వాములు తెలిపారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త  తిప్పాభట్ల వెంకట రామకృష్ణ చే ఆలయ విశిష్టతపై ప్రత్యేక ప్రవచన కార్యక్రమం జరిగింది.
    
డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు ) మాట్లాడుతూ ఏప్రియల్ రెండు బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ యాగశాలలో  ఆవాహిత దేవి దేవతల హోమములు, శ్రీ నూకాలమ్మ అమ్మవారి మూల మంత్ర హోమం, విశ్వశాంతి కొరకు మహా పూర్ణాహుతి జరపబడుతుందని  అనంతరం 11 గంటల నుంచి  శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి  వివిధ రకాల పిండి వంటలు మధుర పదార్థాలతో కూడిన కుంభాన్ననివేదన తదుపరి గ్రామ భక్త మహాశయులకు మహా అన్నసమారాధన కార్యక్రమం జరపబడుతుందని, ఉదయం 10 గంటల నుంచి కోయ్యలగూడెంకు చెందిన ఆవుల రాంబాబు నేత్రుత్వంలో సాయి సినీ భక్తిరంజని కార్యక్రమం జరుగుతుందని, మహా అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయంతం చేశారు.