Hot Posts

6/recent/ticker-posts

నవోదయ సీట్లు సాధించిన పెద్దాపురం సాగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు


కాకినాడ జిల్లా పెద్దాపురం: మండలంలోని పెద్దాపురం స్థానిక సాగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు 2024-2025 నవోదయ ఫలితాలలో మంగళవారం విడుదలైన ఫలితాలలో సాగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు రెండు సీట్లు సాధించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా 5వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అడ్డెల్తి మిస్ వెల్ కూచిమంచి హర్ష సత్య గంగ అర్హత సాధించారు. 

ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సత్యవేణి మరియు అధ్యాపక బృందం వై. రత్న సుందరి, కే. సూర్య శంకర్రావు, వి. శాంత కుమారి, పి. నీరజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాల విద్యార్థులు నవోదయలో అర్హత సాధించడంలో తమ పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి తెలుపుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.