![]() |
మొహమ్మద్ రఫీక్ |
ఏలూరు జిల్లా, చింతలపూడి: ముస్లింల హక్కులను కాల రాయడానికి ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 29వ తేదీన ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరఫున విజయవాడలో నిర్వహించే ధర్నాకు ముస్లిం సమాజం యావత్తు తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు మొహమ్మద్ రఫీక్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చింతలపూడిలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వలన దేశంలో ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టిందని, ఈ బిల్లు ద్వారా ముస్లింల ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని అన్నారు. ముస్లింల పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను హరింప చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాతే ఇస్లామీ హింద్ తెలియజేస్తున్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బిల్లు సవరణలు చేయడం కాకుండా పూర్తి బిల్లును ఉపసంహరించుకోవాలని జమతే ఇస్లామి హింద్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ముస్లింలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు మతపరమైన హక్కులు ఉన్నాయని వాటిని ఈ బిల్లు ద్వారా రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు ఈనెల 27వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం అందించే ఇఫ్తార్ విందును ముస్లిం సమాజం బహిష్కరించాలని కోరారు.
అపార అనుభవం దూరదృష్టి ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు మంచి పేరు ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం ప్రవేశపెట్టి సవరణ బిల్లు వ్యతిరేకంగా గళం విప్పి ముస్లింల మనోభావాలను మత పరమైన హక్కులను కాపాడాలని కోరారు. ఈ నెల 29న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరుపున జరిగే ధర్నాకు కులమతాలకు అతీతంగా లోకికవాదులు ప్రజాస్వామ్య వాదులు అందరూ పాల్గొనాలని, నేడు ముస్లింలకు జరుగుతున్న అన్యాయం రేపు వేరే మతాలు కూడా జరగవచ్చు అని రాజ్యాంగ బంధమైన హక్కు కోసం జరిగే ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని మహమ్మద్ రఫీక్ కోరారు.
చింతలపూడి
రిపోర్టర్
బాలస్వామి. B