Hot Posts

6/recent/ticker-posts

రాష్ట్ర వ్యాప్తంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పై పరీక్షకు 3,91,837 హాజరు


విజయవాడ: ఉల్లాస్ (Understanding of Lifelong Learning for All in Society) కార్యక్రమం కింద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పై పరీక్ష నిర్వహించబడింది. మొత్తం 18,485 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4,15,000 మంది అభ్యాసకులకు శిక్షణ తరగతులు అందించగా, వారిలో 3,91,837 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 94.4% హాజరు నమోదైంది.

ఈ రోజు పరీక్షలో నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ అందించిన ప్రశ్నపత్రాన్ని ఉపయోగించారు. పరీక్ష ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగింది.

జాతీయ స్థాయి పరిశీలకుడిగా కుల్దీప్ (ఢిల్లీ అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి) రాష్ట్రానికి విచ్చేసి, పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యా శాఖ (SERP), మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సమర్థంగా సహకరించడంతో పరీక్ష విజయవంతంగా పూర్తయింది.