Hot Posts

6/recent/ticker-posts

శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో 61వ ఉగాది జాతర మహోత్సవాలు 25న మొదలు


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న ఆధ్యాత్మిక అమ్మవారి ధామం శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో 61వ ఉగాది జాతర మహోత్సవాలు ఈ నెల 25న మంగళవారం మొదలు అవుతున్నాయని డాక్టర్ రాజాన సత్యనారాయణ అన్నారు.

డాక్టర్ రాజాన మాట్లాడుతూ మార్చి 25వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ జాతర మహోత్సవాలు 25వ తేదీ ఉదయం 8 గంటలకు గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి సుమారు వెయ్యి మంది మహిళలలు కలశాలను చేతబూని శోభాయాత్ర నిర్వహించడంతో ప్రారంభమవుతాయని తెలిపారు.

ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) తో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలలో మహిళలు పాల పొంగళ్ళు, సప్త నదీ జలాలతో ప్రతి ఒక్కరు పాల్గొని తరించాలని కోరారు. అమ్మ అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ ఉగాది జాతర మహోత్సవాలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అర్చక స్వాములు నిత్య పూజా కైంకర్యాలు, అభిషేకాలు మరియు సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు, గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రసాదం వితరణ జరిగిందని డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now