చింతలపూడి: మండలంలోని నాగిరెడ్డి గూడెం పరిసరాల్లో నాటు సారా కాస్తున్న స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ (ఎన్ఫోర్స్మెంట్ ) ఏలూరు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ ఏలూరు అవులయ్య ఆధ్వర్యంలో VRO, గ్రామ మహిళా పోలీసుల ఆధ్వర్యంలో నాటు సారాయి స్థావరాలపై దాడులు చేయటం జరిగింది.
ఈ దాడులలో భూక్యా నాగరాజు అను వ్యక్తిని అదుపులోకి తీసుకుని 30 లీటర్ల నాటసారాయి, 600 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం, వడిత్య బాలమ్మ అను మహిళను అదుపులోకి తీసుకుని 15 లీటర్ల నాటు సారాయి స్వాధీనం, బాణావతు జ్యోతి అను మహిళను అదుపులోకి తీసుకుని ఐదు లీటర్ల నాటు సారాయి స్వాధీనం, వడిత్య రామదాసును అదుపులోకి తీసుకుని 20 లీటర్ల నాటు సారాయి 600 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం, వడిత్య బాలరాజును అదుపులోకి తీసుకుని 25 లీటర్ల నాటు సారాయి, 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
నాగిరెడ్డిగూడెం గ్రామంలో మొత్తం 2400 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. 95 లీటర్ల నాటు సారాయిని స్వాధీన పరచుకోవడం అయినదని ఎక్సైజ్ సి ఐ పి .అశోక్ తెలిపినారు. ఈ దాడులలో AES పాండురంగారావు, అజయ్ కుమార్ సింగ్, CI లు ధనరాజ్, సత్యవతి, SI లు RVL నరసింహారావు, అబ్దుల్ కలీల్, జగ్గారావు పాల్గొన్నారు. అనంతరం నాగిరెడ్డిగూడెం గ్రామంలో ప్రచార రథంతో కాన్వాయి నిర్వహించారు.