* ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
• 99.64 శాతం హాజరు
• పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు.వి ఐ.ఏఎస్.,
విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ (ఓరియెంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) మెయిన్ లాంగ్వేజ్ పరీక్ష సజావుగా జరిగిందని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 93,746 మంది విద్యార్థులకు గానూ 93,405 మంది విద్యార్థులు (99.64 శాతం) హాజరయ్యారని, 330 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. 2,234 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 857 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., తెలిపారు.
విద్యార్థులకు న్యాయం చేస్తాం: విద్యాశాఖాధికారులు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్ బాస్కో పాఠశాలలో పరీక్ష రాస్తున్న ముగ్గురు రెగ్యులర్ విద్యార్థులకు ఇన్విజిలేటర్ తప్పిదంతో సంస్కృతం పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని, ముగ్గురు ప్రైవేటు విద్యార్థులకు రెగ్యూలర్ ప్రశ్నాపత్రం అందించారు. పరీక్ష అనంతరం విద్యార్థులు గమనించడంతో ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు దృష్టికి తీసుకురాగా ఉన్నతాధికారులు స్పందించి స్థానిక అధికారుల నుండి నివేదిక తెప్పించి, సంస్కృతం పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు అన్యాయం జరగకుండా మూల్యాంకనం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. తప్పిదానికి కారణమైన ఇన్విజిలేటరును సస్పెండ్ చేసి, చీఫ్ సూపరిండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.