Hot Posts

6/recent/ticker-posts

టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష: డిఇవో ఎం వెంకట లక్ష్మమ్మ


ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఒక గమనిక. మార్చి నెల 31న అంటే సోమవారం రాయాల్సిన సోషల్ స్టడీస్ పరీక్ష ఒకరోజు వాయిదా పడింది.

31-03-2025 (సోమవారం)న ఈద్ అల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా సెలవు దినంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందున, సోషల్ స్టడీస్ పరీక్ష 01-04-2025 న అంటే(మంగళవారం) ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తున్నట్లు డిఇవో ఎం వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

పరీక్ష తేదీలోని ఈ మార్పుని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో చదివి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆమె కోరారు.

విద్యార్థులు ఈ మార్పును గమనించి సోషల్ స్టడీస్ పరీక్షను సోమవారం బదులుగా మంగళవారం రాయడానికి ప్రిపేర్ కావాలని సూచించారు.