Hot Posts

6/recent/ticker-posts

ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు అండగా ఉంటుంది: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు


Dr. BR Ambedkar Konaseema, అమలాపురం: పగడాల ప్రవీణ్ మరణ వార్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తీవ్ర విషాదఛాయలో మునిగిపోయింది. ఇది యాక్సిడెంట్ వల్ల కలిగిన మరణంకాదని కావాలనే కొంతమంది ఆయన హతమార్చారని క్రైస్తవ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇందు నిమిత్తం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వం సరైన దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి. 

ఆ క్రమంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వివిధ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు వేలాది పాస్టర్స్, విశ్వాసులు అమలాపురం స్థానిక గడియారం స్తంభం సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ సమాజం తరపున శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అమలాపురం శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణ వార్త వినగానే చలించిపోయానని ఆయన అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ప్రభుత్వం తప్పకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుందని క్రైస్తవ సోదరులందరూ శాంతియుతంగా ఉండాలని ఆయన అన్నారు. 

శాంతియుత ర్యాలీ స్థానిక గడియారం స్తంభం సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం చేరుకుని జిల్లా రెవెన్యూ అధికారి బి ఎల్ ఎన్ రాజకుమార్ కి జిల్లా యూపీఎఫ్ కమిటీ నాయకులు, వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా క్రైస్తవ నాయకులు పాస్టర్స్ ఎర్నెస్ట్ తాతపూడి, ఎం యెహోషువ, వి రాజ్ కుమార్, నున్న ప్రభు కుమార్ యేసు రత్నం, సామ్యూల్ జ్యోతి, పాల్ ప్రసాద్, స్వర్జన్ రాజు, భాస్కర్ రావు, జాన్ పాల్, మహమ్మద్ ఆనంద్, జార్జ్ పాపఫ్, ఇమ్మానుయేలు, జ్యోతి, సత్యానందం, జి సత్యప్రసాద్, వై పరంజ్యోతి బాబు వై సురేష్ కుమార్ తాతపూడి నరేష్, మహిళా దైవజనురాళ్లు ఎస్తేరు తాతపూడి, జిమిమా గ్రేస్, రాణి, ఎం సునీత తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.