అశ్వారావుపేట/దమ్మపేట: దిబ్బగూడెంలో నిర్వహిస్తున్న దిబ్బగూడెం గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు హాజరై టోర్నమెంట్ నీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించుకోవాలని, క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించి క్రీడాకారుల మధ్య స్నేహ బంధాన్ని పెంపొందిస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట నియోజకవర్గ నాయకులు ద్వారా యుగంధర్, అంకత ఉమా మహేశ్వరరావు, మాజీ సర్పంచ్ కునుసొత్తు చిట్టి బాబు, మహిళా నాయకురాలు యట్ల వెంకమ్మ, నలుపు నాగేంద్ర, కె బాలాజీ తదితరులు ఉన్నారు.