టి. నరసాపురం: శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్య క్షేత్ర ప్రాంగణంలో శివరాత్రి మహోత్సవంలో భాగంగా మూడో రోజు స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా బుధవారం రాత్రి నిర్వహించారు. స్వామి వారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు మండల మెజిస్ట్రేట్ తోట సత్య సాయిబాబ, సరస్వతి దంపతులు, ఎస్ ఐ ఎం.జయబాబు, జ్యోతి దంపతులు అందజేశారు.
వీరికి స్థానిక సర్పంచ్ మోదుగ సునంద ఆలయ కమిటీ చైర్మన్ కమ్మిల రమేష్ రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి కల్యాణం సందేపుడి పినాక పాణి దంపతులచే నిర్వహించారు. సుమారు కళ్యాణానికి 6000 మంది హాజరైనట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పసుమర్తి రాము, పర్వతనేని మురళి లు మాట్లాడుతూ దాతల సహకారంతో గత 28 సంవత్సరాలుగా శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం 29వ సంవత్సర కళ్యాణ మహోత్సవాన్ని ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు. మూడో రోజు స్వామివారి కళ్యాణం, నాలుగు రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం, ఆఖరి రోజు అఖండ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు అడపా నాగరాజు, కాసనేని వెంకట్రావు, మండం ఆదిత్య, తోట లక్ష్మీనారాయణ తోపాటు అధిక సంఖ్యలో శివ భక్తులు పాల్గొన్నారు.