Hot Posts

6/recent/ticker-posts

ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం


టి. నరసాపురం: ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్దుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవరపు శ్రీరామ్ మూర్తి, మండల పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణ గౌడ్ నిర్వహించారు.

మండలంలోని జగ్గవరం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరాబత్తుల కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు కరపత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుని, కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు ఘన విజయం చేకూర్చాలని జగ్గవరం హై స్కూల్ ఉపాధ్యాయులతోపాటు సచివాలయం సిబ్బందిని కలిసి ఓటు వేయమని గ్రాడ్యుయేషన్ ఓట్ ను రాజశేఖర్ కి వేసి గెలిపించాలని కోరారు.

ఈ ప్రచారంలో.. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణ గౌడ్, వెలిది నాగబాబు, లింగారెడ్డి శ్రీను, భీమవరపు జగ్గయ్య, అద్దంకి రాంబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now