Hot Posts

6/recent/ticker-posts

ఏలూరులో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. అవాస్తవలతో అలజడి సృష్టించవద్దు: జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి


ఏలూరులో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. అవాస్తవలతో అలజడి సృష్టించవద్దు: జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఉంగుటూరు బాదంపూడిలో ఒక పౌల్ట్రీల్లో ఇటీవల కోళ్లు మృతి

నమూనాలను ల్యాబ్ కు పంపిన ఏలూరు జిల్లా అధికారులు - బర్డ్ బ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారణ

ఏలూరులో జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం...

సత్వర చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాలు

పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

కమాండ్ కంట్రోల్ రూమ్ 9966779943 నెంబర్‌ ఏర్పాటు

 
ఏలూరు జిల్లా, ఏలూరు: ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక పౌల్ట్రీ ఫామ్ లో సుమారు లక్ష కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే అకస్మాత్తుగా ఇంత భారీ స్థాయిలో కోళ్లు మృత్యువాత పడటంతో అప్రమత్తమైన అధికారులు మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షలు నిమిత్తం తరలించారు. అయితే వాటిల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేశారు.

 ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియ చేయాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు. 20 రాపిడ్ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేశారు.

ఏదైతే బాదంపూడిలోని పౌల్ట్రీ ఫారంలో బర్డ్స్ లో నిర్ధారణ అయిందో అక్కడి నుంచి పది కిలోమీటర్ల పరిధిలోని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ తెలియజేసారు. అదేవిధంగా బర్డ్స్ ఫ్లూ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు వివరించేలాగా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఏలూరు జిల్లాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని , సరైన నిర్దారణ లేకుండా ఎవరైనా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు.