Hot Posts

6/recent/ticker-posts

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారించాలి. సిపిఎం


చింతలపూడి: పశ్చిమ వాహిని.సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుపై ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజా చైతన్య యాత్రల ద్వారా ప్రజల వద్ద నుండి సేకరించి ప్రభుత్వానికి అర్జీల ద్వారా విన్నవించాలని పిలుపులో భాగంగా చింతలపూడి సిపిఎం పార్టీ మండల కమిటీ సేకరించినటువంటి ప్రజా సమస్యలను ఈరోజు రెవిన్యూ మండల కార్యాలయం ముందు చాలా కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేసి మండల తహసిల్దార్ ప్రమద్వరకు సేకరించినటువంటి ప్రజా సమస్యలను వినతుల రూపంలో ప్రభుత్వానికి తెలియజేయాలని అందజేశారు. 

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ పి. పాండురంగారావు మాట్లాడుతూ చింతలపూడి మండలానికే కాకుండా చుట్టుప్రక్కల ఐదు మండలాలకు ఉపయోగపడే నూరు పడకల ఆసుపత్రి నిర్మాణం సత్వరమే పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తేవాలని, గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేయక వ్యర్దంగా పడియున్న కాలనీల నిర్మాణం ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి లబ్ధిదారులకు వెంటనే అందించాలని, చింతలపూడి ఎత్తిపోతల భూ నిర్వాసిత రైతులకు 40 లక్షల రూపాయల నష్టపరిహారం అందేటట్లు తిరిగి అవార్డు ఇవ్వాలని, అట్టహసంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన గుంతల పూడ్చివేత కార్యక్రమం సగంలో ఆగిపోయాయని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 

పట్టణ నాయకులు ఎస్.సూర్యకుమార్ మాట్లాడుతూ పెద్దల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్ధిదారులకు చాలామందికి డబ్బులు బ్యాంకులలో పడటం లేదని లబ్ధిదారులు వాపోతున్నారని అన్నారు. 

ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు రామశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహిస్తూ ప్రజా చైతన్య యాత్రలో వచ్చినటువంటి సమస్యలు మండల తహసిల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో పంపుట జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవ గురు సత్యనారాయణ, ఎం.వర లక్ష్మీదేవి, ఆర్.ధర్మారావు, కే. అనురాధ, వాసు, గోపలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.