విజయవాడ: దేవాలయంలో భక్తి కార్యక్రమంతో పాటు భక్తుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు.
స్థానిక ముత్యాలంపాడులోని సాయిబాబా దేవాలయంలో జరిగిన ఉచిత హోమియో మందు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేకమంది వడదెబ్బకు గురి అవుతున్నారన్నారు.
దేవాలయ నిర్వాహకులు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మందులు వేసుకొని వడదెబ్బ నుండి నివారణ పొందాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా హాజరైన వారందరికి ఉచితంగా హోమియో మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మైత్రేయ వర్మ, దేవాలయ నిర్వాహకులు, సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
Staff Reporter
Suresh V
Vijayawada