విజయవాడ: చరిత్రహీనుడు బోండా ఉమా అని విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు బటన్ నొక్కి అందజేస్తే... చంద్రబాబు అనే దుర్మార్గుడు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పసుపు కుంకాలు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎలా అందించారని సూటిగా ప్రశ్నించారు.
పేద ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. సెంట్రల్ గుండా గిరి అరాచకాలను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అమాయక ప్రజలపై బోండా ఉమ తన కుమారులు టిడిపి నేతలు చేస్తున్న అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా విజయవాడ పైయకాపురం 61వ డివిజన్లో ఎన్నిక ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు పర్యటించారు.
ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వెంకట్రావు, రంగారెడ్డి, నాగిరెడ్డి, మల్లికార్జున, స్టేట్ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ బోను దుర్గా నరేష్ వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
Staff Reporter
Suresh V
Vijayawada