Eluru: గంగన్నగూడెంలోని శ్రీకృష్ణ కన్వెన్షన్ హాల్లో దెందులూరు నియోజకవర్గ గౌడ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సమావేశానికి సుమారు 5 వేల మందికి పైగా గౌడ సోదర, సోదరీమణులు మరియు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, గౌడ సంఘం ప్రముఖులు, నాయకులు హాజరైనారు.
ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసులు, పౌరుషానికి ప్రతిరూపాలైన గౌడ సొదర సోదరీమణులకు, మా కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. నేను 2019 లో ఇక్కడికి వచ్చినప్పటి నుండి గౌడ సోదరులు నాకు అండగా నిలుస్తున్నారు. నన్ను కుటుంబ సభ్యుడిలాగా ఆదరించారు, ఆశీర్వదించారని తెలిపారు.
కేసులు, కొట్లాటలు, దాడులు, దౌర్జన్యాలను, అనేక కష్టాలను ఎదుర్కొంటూ కూడా నాకు అండగా నిలిచారు. రాబోయే మన ప్రభుత్వంలో మీ అందరికి ఆర్ధికంగా మంచి చేసే అనేక కార్యక్రమాలు చేస్తానని మీ బిడ్డగా మాట ఇస్తున్నానని అన్నారు. దెందులూరులో ఒక గొప్ప గౌడ కళ్యాణ మందిరం మరియు అత్యాధునిక గౌడ సేవా కేంద్రాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మీ అందరి సహకారం మాకు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాదు శివరామకృష్ణ, టీటీడీ బోర్డు మెంబర్, నియోజకవర్గ పరిశీలకులు నెరుసు నాగసత్యం, ఎంపీపీ తాత రమ్య, గౌడ నాయకులు అశోక్ గౌడ్, మేకా లక్ష్మణ్ రావు, తాత సత్యనారాయణ, మట్టా శంకర్ గౌడ్, పొన్నూరు శంకర్ గౌడ్, గౌడ ఎంపీటీసీలు, సర్పంచ్ లు, డీసీఎంఎస్ డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల పెద్ద గౌడ్ లు మరియు దెందులూరు నియోజకవర్గ గౌడ కార్యవర్గ నాయకులు, సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.