Hot Posts

6/recent/ticker-posts

3 సెట్స్ నామినేషన్ పూర్తి.. 37 కోట్ల రూపాయలు ఆస్తులు ప్రకటించిన ఏలూరు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కావూరి లావణ్య


ఏలూరు ప్రతినిధి:
ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కావూరి లావణ్య గురువారం 3 సెట్స్ నామినేషన్ పూర్తి చేసారు. 37 కోట్ల రూపాయల మేర ఆస్తులను అఫడవిట్ లో పేర్కొన్నట్లు సమాచారం. జిల్లాలో స్థానికురాలిగా తొలిసారి ఒక మహిళా అభ్యర్థి 37 కోట్ల రూపాయలు ఆస్తులు ప్రకటించడం ఒక హాట్ టాపిక్ గా మారింది. 

కావూరి వారి బ్రాండ్ కు సరితూగేలా ఆస్తులు ప్రకటించడం విశేషం. మిగతా పార్టీల నాన్ లోకల్ అభ్యర్థులు వారికి కంపెనీలు, పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటికీ అఫడవిట్ లలో ప్రకటించకపోవటం గమనార్హం. ఆన్ లైన్లో కావూరి లావణ్య అఫడవిట్స్ పెద్ద సంఖ్యలో డౌన్లోడ్ చేసుకొని వీక్షించటం జిల్లాలో చర్చనీయాంశమైంది. స్వతహాగా ఒక మహిళా అభ్యర్థి ఈమేరకు ఆస్తులు ప్రకటించడంతో ఏలూరు పార్లమెంటు పరిధిలో ఇండియా కూటమి బలపరచిన అభ్యర్థి కావూరి లావణ్య గెలుపుపై జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకోవటం విశేషం. 

దేశంలో బీజేపీ కి ఎదురు గాలి వీస్తుండటంతో ఇండియా కూటమికి దేశ ప్రజల మద్దతు ఉండటంతో కావూరి లావణ్య కి కలసివచ్చే అంశంగా జిల్లా ప్రజలు భావిస్తున్నారు. దానికి తోడు ఏపి పిసిసి అధ్యక్షురాలు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావటం, మరియు సిపిఎం, సిపిఐ పార్టీలు, వారి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాల మద్దతు జిల్లాలో పెద్ద ఎత్తున కావూరి లావణ్య కి ఉండటం కలిసి వచ్చే అంశం పరిగణిస్తున్నారు. 

ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇక్కడ ఆంద్రప్రదేశ్ ప్రజలు పెద్ద సంఖ్యలో తెలంగాణలో ఉండటం వారిలో ఏలూరు జిల్లా వాసులు కూడా ఉండటం, వారంతా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు కావడం కావూరి లావణ్య కి కలసివచ్చే అంశం. అదేవిధంగా కావూరి లావణ్య మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ పోలికలతో ఉండటమే కాకుండా ఇందిరా గాంధీ ఆశయాలతో ప్రజా సేవకే అంకితమై రాజకీయాల్లోకి రావటం ఆమెకు కలసి వచ్చే అంశం. ఏది ఏమైనా ఏలూరు పార్లమెంటు బరిలో కావూరి లావణ్య పోటీ అంతిమ విజయంగా ప్రజలు భావిస్తున్నారు.

ఎడిటర్:
Akhil Babji Shaik